Sunday, April 28, 2024

నాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం… కలగర శ్రీనివాస్

నిజామాబాద్ : త‌నపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, ఒకవేళ అవినీతి జరిగిందని రుజువు చేస్తే కోటి రూపాయల జరిమానా కడతాన‌ని కమ్మ సంఘం పూర్వ అధ్యక్షులు కలగర శ్రీనివాస్ బహిరంగ సవాల్ విసిరారు. మంగళవారం నిజామాబాద్ నగరంలోని మాధవ నగర్ లో గల కమ్మ సంఘం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల త‌నపై కొందరు కావాలనే సమావేశం ఏర్పాటు చేసి కమ్మ సంఘంలో కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రేకుల షెడ్డు మొండి గోడలతో ఉన్న కమ్మ సంఘం భవనాన్ని ఏసీ కళ్యాణ మండపం వరకు ఎంతో అభివృద్ధి చేశామని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా కమ్మ సంఘం అభివృద్దే ద్యేయంగా పాటు పడినట్లు తెలిపారు. సంఘ అభివృద్ధికి తమ సొంత డబ్బులు వెచ్చించామే కానీ, ఎక్కడ కూడా ఒక్క రూపాయి అవినీతి జరగలేదని పేర్కొన్నారు. రూ.4 కోట్ల విలువైన స్థలం కేవలం ఒక వ్యక్తి రూ.2కోట్లకే కొనుగోలు చేసి త‌మకు అన్యాయం చేశాడని త‌మకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు కమ్మ సంఘాన్ని ఆశ్రయించారని పేర్కొన్నారు.

ఈ సమస్యను పెద్దల దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం చేశామని వెల్లడించారు. ఇలాంటి కొన్ని విషయాలు మనసులో పెట్టుకొని కావాలనే త‌నపై తప్పు డు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1999 సంవత్సరంలో కమ్మ సంఘం స్థాపించామన్నారు. 2021లో సభ్యత్వం తీసుకున్న వారే తనపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నో కమ్మ సంఘాలకు లక్షల రూపాయలు విరాళాలు ఇచ్చానని, అలాంటిది కమ్మ సంఘంలో అవినీతికి పాల్పడ్డానని అనడంలో అర్థం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్మ సంఘానికి 30 లక్షల ఆదాయం వస్తే కోట్ల రూపాయలు అవినీతి జరిగిందనడంలో అర్థం లేదని పేర్కొన్నారు. ఎక్కడా ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని తెలిపారు. ఎటువంటి ఆధారాలు లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పూర్తి సాక్షాదారులతో తాను అవినీతికి పాల్పడినట్లు రుజువు చేస్తే దేనికైనా సిద్ధమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఆరోపణలు పునరావృతం చేస్తే కోర్టును ఆశ్రయించి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పూర్వ ప్రధాన కార్యదర్శి మండవ రామకృష్ణ, కమ్మ సంఘం ప్రస్తుత అధ్యక్షులు కలగర వెంకటేశ్వరరావు, కమ్మ సంఘం ప్రధాన కార్యదర్శి కావూరి కృష్ణారావు, సంయుక్త కార్యదర్శి వెనిగళ్ళ సురేష్, డైరెక్టర్లు గండు రాము చుండూరి నరేష్, అట్లూరి రవీంద్రనాథ్ ఠాగూర్, వేములపల్లి కిరణ్ కుమార్, మాజీ డైరెక్టర్ కాజా శివరా మకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement