Tuesday, May 7, 2024

ఆ పిల్లి.. ఇన్ స్టాగ్రామ్ సంచలనం!

న్యూయార్క్: ముద్దులొలుకుతున్న ఈ బుల్లి పిల్లి.. ఇప్పుడు ఇన్ స్టా గ్రామ్ లో ఓ పెద్ద సంచలనం. పుస్ ఇన్ బూట్స్ చిత్రంలో స్పానిష్ భాష మాట్లాడే ఓ పిల్లి పాత్ర ఓ హిట్. అందులోని పిల్లికి ఉన్నట్లే ఈ నిజం మార్జాలానికి నల్లని గుండ్రటి పెద్దపెద్ద కళ్లుండటం ఇప్పుడు సంచలనానికి కారణమైంది. న్యూయార్క్ కు చెందిన ఓ పెంపుడు పిల్లి ఇది.

చూడముచ్చటగా పచ్చటి, కాషాయ,తెలుపురంగుల, ఒత్తయిన బొచ్చుతో చూడముచ్చటగా ఉన్న ఈ పిల్లి చిత్రాలను ఆమె యజమాని ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. అంతే అదో సంచలనమైపోయింది. కొద్ది గంటల్లోోనే 6 లక్షలమంది చూసి ఫిదా అయిపోయారు. ఈ స్పందన చూసి ఉబ్బి తబ్బిబ్బయిన యజమానికి తన ముద్దుల మార్జాలం గురించి చెప్పుకొచ్చారు. అది బాగా సిగ్గరి అని, ఎవరైనా తాకేందుకు ప్రయత్నిస్తే ఇష్టపడదని, అయితే ఒకసారి దగ్గరకు చేరితే అదిగాని, మనం కానీ వదలబుద్ది కాదని తెగ సంబరపడిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement