Friday, December 1, 2023

Terrorists – జమ్మూకశ్మీరులో ఉగ్రవాదుల గుట్టు రట్టు – అయిదుగురు అరెస్ట్

జమ్మూకశ్మీరులో పోలీసులు ఉగ్రవాదుల గుట్టును రట్టు చేశారు. కుల్గాం జిల్లాలో ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసిన పోలీసులు అయిదుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులు ఆదిల్ హుస్సేన్ వనీ, సుహైల్ అహ్మద్ దార్, ఐత్మద్ అహ్మద్ లావే, మెహ్రాజ్ అహ్మద్ లోన్, సబ్జార్ అహ్మద్ ఖార్ లను అరెస్ట్ చేశారు.

- Advertisement -
   

వీరికి లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయని పోలీసులు చెప్పారు. బందిపొరాలో ఉగ్రవాదుల మాడ్యూల్ ను ఛేదించిన నెల రోజుల తర్వాత ఈ పరిణామం వెలుగుచూసింది. 26 అస్సాం రైఫిల్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సంయుక్త ఆపరేషన్ సందర్భంగా ఉగ్రవాదులను అరెస్టు చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement