Sunday, May 5, 2024

Breaking: ఆళ్లగడ్డలో ఉద్రిక్త ప‌రిస్థితులు

క‌ర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజ‌క‌వ‌ర్గంలో ఉద్రిక్త ప‌రిస్థితులు చోటు చేసుకున్నాయి. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు జగద్విఖ్యాత రెడ్డిని అరెస్టు చేస్తారన్న ప్రచారంతో అక్క‌డ టెన్ష‌న్ టెన్ష‌న్ వాతావ‌ర‌ణం ఉంది. రెండు రోజుల క్రితం భూమా నాగిరెడ్డి పేరుతో నిర్మించిన బస్ షెల్టర్ ను రోడ్డు విస్తరణ పేరుతో కూల్చివేయడంతో దానిని జగద్విఖ్యాతరెడ్డి అడ్డుకున్నారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆందోళనకు దిగారు.

దీంతో జగద్విఖ్యాత రెడ్డి పోలీసు విధులకు ఆటంకం కల్గించారని, పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈకేసులో ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవ్వడంతో ఉద్రిక్తత తలెత్తింది. జగద్విఖ్యాత రెడ్డిని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఆళ్లగడ్డలో పోలీసులు పెద్దయెత్తున మొహరించడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. దీంతో టీడీపీ శ్రేణులు కూడా పెద్దయెత్తున భూమా అఖిలప్రియ ఇంటి వద్దకు చేరుకున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement