Friday, April 26, 2024

సినిమా థియేటర్లపై మళ్లీ ఆంక్షలు.. పలు కీలక సినిమాలు వాయిదా?

తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో తెలుగు సినిమాపై ఈ ఎఫెక్ట్ పడుతోంది. క్రమంగా సినిమాల రిలీజ్‌లు వాయిదా పడుతున్నాయి. మరోవైపు కరోనా తీవ్రతతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినిమా ధియేటర్లు, మల్టీప్లెక్సుల్లో 50 శాతం సీటింగ్ కెపాసిటీ నియమాన్ని అమలు చేస్తారని తెలుస్తోంది. ఏప్రిల్ 15 నుంచి 30 వరకూ ఈ నిబంధన అమల్లో ఉండేలా నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లో పలు సినిమాల విడుదల తేదీల్లో మార్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఏప్రిల్ 16న విడుదల కావాల్సిన ‘లవ్ స్టోరీ’ ఇప్పటికే వాయిదా పడింది. ఈ సినిమాను రంజాన్ కానుకగా మే 13న విడుదల చేస్తారని సమాచారం. ఏప్రిల్ 23న రిలీజ్ కావాల్సిన ‘టక్ జగదీష్’ మే 1న విడుదల అవుతుందని తెలుస్తోంది. అటు మే 13న విడుదల కావాల్సిన మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ ఆగస్టు 13న రిలీజ్ అవుతుందట. ఆగస్టు 13న విడుదల కావాల్సిన ‘పుష్ప’ దసరాకు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అటు దసరాకు ఫిక్స్ అయిన ‘RRR’ కూడా వాయిదా పడే అవకాశాలున్నాయని టాక్ నడుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement