Friday, April 19, 2024

ధర్మం – మర్మం : మన పుణ్యభూమి – పుణ్యతీర్థములు (ఆడియోతో…)

మన పుణ్యభూమి – పుణ్యతీర్థముల గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ

బ్రహ్మపురాణంలోని గౌతమీ ఖండంలో వశిష్ఠాది మహర్షులకు పుణ్యతీర్థముల గురించి బ్రహ్మదేవుడు ఈవిధంగా వివరించెను.

జాంబవే భారతం వర్షం తీర్థం శ్రుతిషు విశ్రుతం
భారతే దండకారణ్యం సర్వతీర్థ మనుత్తమం
కర్మ భూమి: యత: పుత్ర తస్మాత్‌ తీర్థం తదుచ్యతే

అనగా భారత వర్షంలోని దండకారణ్యము విశేషించి కర్మభూమి కావున ఇది సాటిలేని ఉత్తమ తీర్థం. దండకారణ్యంలో అలాగే భారతవ ర్షంలోని జంబూ ద్వీపంలో దైవ తీర్థములు, ఆర్ష తీర్థములు, మానవ తీర్థములు, ఆసుర తీర్థములు కలవు.

హిమాచల, వింధ్య పర్వతముల మధ్యన ఆరు దైవ తీర్థములు అలాగే దక్షిణ సముద్ర వింధ్య పర్వతముల మధ్యన కూడా ఆరు దివ్యతీర్థములు కలవు. భారత వర్షంలో ఈ పన్నెండు నదులు ప్రధానమైనవి. ఈ నదుల వలనే భారతదేశం పుణ్యభూమిగా బహుపుణ ్య ఫలప్రదముగా పూజించబడుచున్నది. ఇవి కర్మభూమి, పుణ్యములను వర్షించేది కావున భారత వర్షమును పుణ్యవర్షమని దేవతలు కీర్తించారు. పర్వత ప్రాంతాలలోని దేవతలు నిర్మించిన తీర్థములు మరియు అసురులు నిర్మించిన ఆసుర తీర్థములు కలవు. దేవతలు నివసించే ప్రాంతాలలో ఋషులు తపస్సు చేస్తూ తమ స్నానాది విధులకు సృష్టించుకున్న జలాశయములను ఋషి తీర్థములుగా పేర్కొంటారు. ఇక మానవులు తమ శ్రేయస్సుకు, మోక్షానికి, పూజకు, సంపదకు, విశేష ఫలం కలిగి కీర్తి లభించడానికి మానవులు నిర్మించుకున్నవి మానుష తీర్థములు.

- Advertisement -

నారదుడు తీర్థబేధముల గూర్చి ప్ర శ్నిస్తూ తీర్థములకు వెళ్ళి సేవించకున్నా ఆ తీర్థ స్వరూపమును, తీర్థ బేధాల గురించి తెలుసుకున్న అన్ని పాపాలు తొలగుతాయని కృతయుగము ఆదిలో మానవులకు, దేవతలకు కూడా తీర్థసేవకు మించి పుణ ్యం సంపాదించే మార్గము మరొకటి లేదని, కొద్దిగా తీర్థ సేవ చేసినా అధిక ఫలాని ్న, అభీష్టములను ప్రసాది స్తుందని, మహావిష్ణువు నాభికమలం నుండి పుట్టిన బ్రహ్మను మించి శాస్త్రధర్మం తెలిసినవారు మరొకరు లేరు కావున తీర్థముల బేధముల గూర్చి తెలియజేయమని నారదుడు పలికెను.

వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement