Saturday, April 27, 2024

ప్రముఖ సాహితీవేత్త కె.కె.రంగనాథచార్యులు కన్నుమూత

ప్రముఖ సాహితీవేత్త, విమర్శకులు, సాహిత్య చరిత్రకారులు, హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు కే. కే. రంగనాధాచార్యులు (80) హైదరాబాద్ నాచారంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనాతో కన్నుమూశారు. ఆయన ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులకు సంపాదకత్వం వహించారు. బహుముఖం, తెలుగు సాహిత్యం చారిత్రక భూమిక, పరిచయాలు – ప్రస్తావనలు వీరి ఇతర రచనలు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేశారు. ఎందురో పరిశోధక విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. మిత భా‌షి, మృదు స్వభావంగల కేకేఆర్ మృతికి తెలుగు సాహితీ లోకం నివాళులు అర్పిస్తోంది.

కాగా తెలుగు సాహిత్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన ప్రముఖ భాషా సాహితీవేత్త, విమర్శకులు, ఆచార్య కె.కె.రంగనాథాచార్యుల మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు భాషా పండితులుగా పలు ఉన్నత పదవులను నిర్వహించిన ఆచార్యులు, తెలుగు సాహిత్య వికాసానికి చేసిన సేవలను సీఎం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబానికి సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement