Saturday, May 4, 2024

బ్రేకింగ్… మంత్రి ఎర్రబెల్లికి తప్పిన ముప్పు

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు పెద్ద ప్రమాదం తప్పింది. వేగంగా వెళుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనానికి ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ దమ్ము చక్రాలు తగిలాయి. ఈ ఘటనలో మంత్రి ఎర్రబెల్లి వాహనం పూర్తిగా ధ్వంసమైంది. మహబూబాబాద్ జిల్లా వెలిశాల, కొడకండ్ల మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది.

అయితే అదృష్టవశాత్తు మంత్రి ఎర్రబెల్లి ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్రస్తుతం ఎర్రబెల్లి క్షేమంగా ఉన్నారని సమాచారం అందుతోంది. అయితే ఈ ఘటనలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ తప్పిదం ఉన్నట్లు అర్థం అవుతోంది. కాగా ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ వార్త కూడా చదవండి: పోలీస్ శాఖలో కరోనాతో హోంగార్డు మృతి

Advertisement

తాజా వార్తలు

Advertisement