Friday, April 26, 2024

అలర్ట్: పోలీస్ శాఖలో మళ్లీ కరోనా..హోం గార్డ్ మృతి

హైదరాబాద్ లో పోలీస్ శాఖలో కరోనా మళ్లీ కలకలం రేపుతోంది. రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకున్నా పలువురు పోలీసు సిబ్బందికి కరోనా సోకుతుంది…ఇటీవల హైదరాబాద్‌లో పదుల సంఖ్యలో పోలీసులు కరోనాబారినపడ్డారు. తాజాగా ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు సుధాకర్ రెడ్డి కరోనాతో గాందఈలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సుధాకర్ కి కరోనా వ్యాక్సిన్ డోస్ పూర్తి అయిన కోవిడ్ తో మృతి చెందారు. వరుస ఉత్సవాలు, బందోబస్తులు , నిరసనలు, ఆందోళనలతో పోలీసు శాఖను కరోనా మహమ్మారి వణికిస్తోంది… ఇప్పటికే పోలీసులకు, వారి కుటుంబ సభ్యులకు కూడా వ్యాక్సిన్‌ వేశారు.. అయితే, ఆందోళనలు ముట్టడి కార్యక్రమాలు ఉంటుండడంతో పోలీసులకు కరోనా టెన్షన్ వెంటాడుతోంది… గత నాలుగు రోజుల నుండి రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి.. ఇదే సమయంలో పోలీసు శాఖలోనూ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి.

పండుగలైనా.. నిరసన, ఆందోళన కార్యక్రమాలు.. ఇలా ఏవైనా పోలీసులే ముందు ఉండాల్సిన పరిస్థితి.. ఈ మధ్య వరుసగా ఉత్సవాలు జరిగాయి… బక్రీద్‌, బోనాలు, ఘట్టాల ఊరేగింపు ఇలా బందోబస్తులో బిజీగా గడిపారు పోలీసులు.. మరోవైపు.. ధర్నాలు, నిరసన కార్యక్రమాలు, ఆందోళనలను అడ్డుకోవడంలోనూ వారే ముందు ఉండాల్సిన పరిస్థితి.. దీంతో.. మళ్లీ కరోనా మహమ్మారి క్రమంగా పోలీసుశాఖలో వ్యాపిస్తోంది. మరోవైపు.. ప్రతిపక్షాలు వరుసగా ఆందోళనకు సిద్ధం అవుతుండడం కూడా.. పోలీసు శాఖను మరింత టెన్షన్‌ పెడుతోంది.

ఇది కూడా చదవండి: బీఎస్పీలో ఆర్ఎస్ ప్రవీణ్.. డేట్ ఫిక్స్

Advertisement

తాజా వార్తలు

Advertisement