Tuesday, May 7, 2024

బీఎస్పీలో ఆర్ఎస్ ప్రవీణ్.. డేట్ ఫిక్స్

మాజీ ఐపీఎస్ అధికారి, స్వేరో చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగస్టు 8న బీఎస్పీలో చేరనున్నారు. తెలంగాణ బీఎస్పీ కో ఆర్డినేటర్ రాంజీ గౌతం సమక్షంలో ప్రవీణ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీలో చేరనున్నారు.ఇటీవల స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన తర్వాత ప్రవీణ్ కుమార్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. స్వేరోలను ఉద్దేశించి ప్రసంగిస్తూ వస్తున్నారు. సీఎం కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేశారు. ఇందులో దాదాపు 50 వేల మంది సభ్యులున్నారు. ఫూలే, అంబేడ్కర్ సిద్ధాంతంతో తాను ముందుకు సాగుతానని ప్రవీణ్ కుమార్ తాను రాజీనామా చేసినప్పుడు చెప్పారు. బహుజనుల కోసం పోరాడుతానని స్పష్టం చేశారు. ఈ క్రమంలో రాజకీయా రంగ ప్రవేశం చేయాలని నిర్ణయించారు. తొలుత అధికారిక పార్టీలో చేరుతారని ప్రచారం జరిగింది. అయితే, ఆయన బీఎస్పీలో చేరాలని నిర్ణయించారు.

ఇది కూడా చదవండి: గెల్లు శ్రీనివాస్‌ కే హుజురాబాద్ టీఆర్ఎస్ టికెట్!

Advertisement

తాజా వార్తలు

Advertisement