Monday, February 26, 2024

వివేకా హత్య కేసు: నిందితుడు సునీల్ యాదవ్‌కు 10 రోజుల సీబీఐ కస్టడీ

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక అనుమానితుడిగా భావిస్తున్న సునీల్ యాదవ్‌ను సీబీఐ అధికారులు శుక్రవారం నాడు పులివెందుల కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసులో సునీల్‌కు సంబంధించిన కీలక ఆధారాలు తమ వద్ద ఉన్నాయని కోర్టులో సీబీఐ తరఫు న్యాయవాదులు వాదించారు. అతడిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్న సీబీఐ తరఫు లాయర్ల వాదనతో కోర్టు ఏకీభవించింది. ఈ క్రమంలో కోర్టు సునీల్ యాదవ్‌కు 10 రోజుల సీబీఐ కస్టడీ విధించింది. సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇటీవల సునీల్‌ను గోవాలో పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అతడు ఈ నెల 4 నుంచి కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. వివేకా హత్యకు ముందు, తర్వాత సునీల్ కుమార్ తీరు అనుమానాస్పదంగా ఉన్నట్టు సీబీఐ అధికారులు భావిస్తున్నారు. కాగా ఇవాళ్టి నుంచి ఈనెల 16 వరకు సునీల్ యాదవ్ సీబీఐ కస్టడీలో ఉండనున్నాడు.

ఈ వార్త కూడా చదవండి: జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్

Advertisement

తాజా వార్తలు

Advertisement