Saturday, April 27, 2024

తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళుతోంది: మంత్రి కేటీఆర్

నిజామాబాద్ జిల్లా: మూడేన్నరేళ్లుగా తెలంగాణా రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించింద‌ని, తెలంగాణా జీఎస్డీపీ వృద్ధి రేటు కూడా అదే స్థాయిలో పెరిగింద‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. నిజామాబాద్ భూమారెడ్డి కన్వెన్షన్ హాల్ లో స్యాండ్ బాక్స్ సంస్థ నిర్వహిస్తున్న టెక్నాలజీ ఫర్ ఇంపాక్ట్ అండ్ స్కేల్ డెవలప్ మెంట్ డైలాగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐటీ మంత్రి కేటీఆర్ హాజర‌య్యారు. ఈ స‌మీక్ష‌లో మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్యాండ్ బాక్స్ సీఈవో మనీష్ అగర్వాల్, ఇతర డెలిగేట్స్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. జనాభాకు తగ్గట్టుగా అభివృద్ధి సాధించడంలో చైనా ఓ మాడల్.. దురదృష్టవశాత్తు ఇండియా ఆ స్థాయిలో టెక్నాలజీ పరంగా అభివృద్ధిలో ఇంకా వెనుకబడే ఉంద‌న్నారు. ఇలాంటి సమయంలో స్యాండ్ బాక్స్ వంటి సంస్థలు టెక్నాలజీ ఫర్ ఇంప్యాక్ట్ అండ్ స్కేల్ వంటి కార్యక్రమాలతో సాంకేతికతను ప్రజలకు ఉపయోగపడే రీతిలో ప్రయోగాత్మకంగా ముందుకు రావడం హర్షణీయ‌మ‌న్నారు. తెలంగాణాలో జరుగుతున్నది ప్రోగ్రెస్ డెవలప్ మెంట్.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకాన్ని రూపొందించిన ఘనత తెలంగాణా రాష్ట్రానిది అన్నారు. కేసీఆర్ చొరవతో కేవలం నాలుగేళ్లలో పూర్తి చేసుకున్న ఘనత కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుది, మిషన్ భగీరథ అలాంటి ఓ ప్రతిష్ఠాత్మక పథకమే అన్నారు. మళ్ళీ నిజామాబాద్ లో ఐటీ హబ్ ప్రారంభోత్సవంకు వచ్చినప్పుడు కాకతీయ స్యాండ్ బాక్స్ బృందం కూడా రావాలని కోరుతున్నా అన్నారు. టెక్నాలజీతో వినూత్న రీతిలో ముందుకెళ్తున్న కాకతీయ స్యాండ్ బాక్స్ సంస్థకు, ఇతర స్టార్టప్ సంస్థలకు అభినందనలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement