Friday, April 26, 2024

మరో రెండు నెలల పాటు ‘డెల్టా’ ప్రభావం

తెలంగాణలో డెల్టా వేరియంట్ కరోనా వేగంగా వ్యాపిస్తోందని.. దీని ప్రభావం మరో 2 నెలల వరకు కొనసాగుతుందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. వరుసగా పండుగలు వస్తున్న నేపథ్యంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా జాగ్రత్తలపై ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, డెల్టా వేరియంట్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతోందన్నారు. ప్రజలు ఇంట్లో కూడా మాస్కులు పెట్టుకోవాలన్నారు. మాస్కు లేకుండా ఉత్సవాల్లో పాల్గొనరాదని డీహెచ్ చెప్పారు.

మరోవైపు రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలు పెరిగాయని, రాజకీయ నేతలు కనీసం మాస్క్ కూడా లేకుండా మాట్లాడుతున్నారని డీహెచ్ శ్రీనివాస్ ఆరోపించారు. కరోనా కట్టడ కోసం సుమారు లక్ష మంది వైద్యులు పనిచేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే వైద్య, పోలీస్, మున్సిపల్ సిబ్బంది కోవిడ్ విధులతో అలసిపోయారని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఈ వార్త కూడా చదవండి: ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement