Thursday, July 29, 2021

ఆర్ ఆర్ ఆర్… లో చిన్నారి పాట అద్భుతమట

రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీం గా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగన్, అలియా భట్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.

ఇక ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేసి సినిమాపై అంచనాలను రెట్టింపు చేశారు చిత్ర యూనిట్. అలాగే మ్యూజిక్ ఆల్బమ్ పై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. కాగా ఈ సినిమాలో ఓ సాంగ్ మాత్రం కొన్నేళ్ల పాటు ప్రతి ఒక్కరి గుండెల్లోనూ నిలిచిపోతుంది అని చెప్తున్నారు. ఆ పాట పాడిన ప్రకృతి అనే చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ… ఆ పాట ఎలా ఉంటుందో చిత్ర యూనిట్ తెలిపింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పాటలు వస్తాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News