Sunday, May 12, 2024

Tech News: గూగుల్‌ మీట్‌.. అదిరిపోయే న్యూ అప్‌డేట్‌..

Mute On Video Conference: వీడియో కాన్ఫరెన్సింగ్‌ ప్లాట్‌ఫామ్‌ గూగుల్‌ మీట్‌లో కొత్త ఫీచర్ వ‌చ్చింది. ప్రస్తుతం ఆన్‌లైన్ మీటింగ్స్‌, ఆన్‌లైన్ క్లాసుల కోసం ఎక్కువ‌గా గూగుల్ మీట్‌నే ఉపయోగిస్తున్నారు. రోజురోజుకూ యూజర్ల సంఖ్య పెరుగుతుండ‌టంతో కొత్త ఫీచ‌ర్లను యాడ్ చేసింది. ఇదివ‌ర‌కు ఏదైనా మీటింగ్ ప్రారంభం అయ్యాక హోస్ట్‌కు మీటింగ్‌లో పాల్గొన్న వారి మైక్స్ ఆఫ్ చేసే ఆప్షన్‌ లేదు.

కొంద‌రు మాట్లాడ‌టం పూర్తయ్యాక‌.. త‌మ మైక్‌ను ఆఫ్ చేయ‌క‌పోయినా.. మీటింగ్ డిస్టర్బ్ అవుతుంది. కానీ, ఇక నుంచి అలాంటి ఇబ్బందులేమి ఉండవు. మీటింగ్‌లో ఉన్న అంద‌రు పార్టిసిపెంట్స్‌ను ఒకేసారి మ్యూట్ చేసే ఆప్షన్ హోస్ట్‌కు ఉంటుంది. వారు మాట్లాడాల‌ని అనుకున్నప్పుడు హోస్ట్ మ్యూట్ ఆప్షన్‌ను తీసేయ‌వ‌చ్చు.

ఈ ఫీచ‌ర్‌ను గూగుల్ వ‌ర్క్‌స్పేస్ ఫ‌ర్ ఎడ్యుకేష‌న్ ఫండ‌మెంట‌ల్స్ అండ్ ఎడ్యుకేష‌న్ ప్లస్ డొమైన్స్‌లో తీసుకురానున్నారు. గూగుల్ వ‌ర్క్‌స్పేస్ ఎడిష‌న్స్‌లో త్వర‌లోనే ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి రానుంది.

ఇది కూడా చదవండి: Project K: మరో మూవీలో సూపర్ హీరోగా డార్లింగ్ ప్రభాస్

- Advertisement -

మ్యూట్ ఆల్ అనే ఫీచ‌ర్ కేవ‌లం మీటింగ్ హోస్ట్‌కు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఒక‌సారి గ్రూప్‌ మీటింగ్‌లో పాల్గొన్న వారు మ్యూట్ చేశాక‌.. మ‌ళ్లీ వాళ్లను అన్‌మ్యూట్ చేయ‌డం కుద‌ర‌దు. ఒక‌వేళ పాల్గొన్న వారు కావాల‌నుకుంటే అన్‌మ్యూట్ చేసుకోవ‌చ్చు. డెస్క్‌టాప్ బ్రౌజ‌ర్ నుంచి గూగుల్ మీట్‌ను యాక్సెస్ చేసుకున్న హోస్ట్‌కు మాత్రమే మ్యూట్ ఆల్ ఫీచ‌ర్ అందుబాటులో ఉంటుంది.

ఇది కూడా చదవండి: Photo Story: విధి రాత అంటే.. ఇట్లనే ఉంటదా

Advertisement

తాజా వార్తలు

Advertisement