Thursday, March 28, 2024

Photo Story: విధి రాత అంటే.. ఇట్లనే ఉంటదా

ఫొటోలో కనిపిస్తున్న అతని పేరు మున్జీర్‌. సిరియాలోని ఇడ్లిబ్‌ బజార్‌ వెంట వెళ్తుండగా.. బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో మున్జీర్‌ తన కుడి కాలును కోల్పోయాడు. మున్జీర్‌ ఎత్తుకున్నది అతని కుమారుడు ముస్తఫా.

సిరియా యుద్ధ సమయంలో గ్యాస్‌ లీక్‌ జరిగింది. ఆ సమయంలో మున్జీర్‌ భార్య జైనెప్‌ గర్భవతి. ప్రమాదకరమైన గ్యాస్‌ పీల్చుకోవడంతో అంగవైకల్యంతో ముస్తఫా పుట్టాడు. ముస్తఫాకు నడుం నుంచి కింది భాగం లేదు. అదేవిధంగా చేతులు లేకుండా పుట్టాడు.

టెట్రా అమేలియా కారణంగా అంగవైకల్యంతో జన్మించినట్టు డాక్ట‌ర్లు తెలిపారు. ముస్తఫాకు భవిష్యత్తులో ప్రత్యేక ఎలక్ట్రానిక్‌ ప్రొస్థెసిస్‌ అవసరం అవుతుంది. దురదృష్టవశాత్తు టర్కీలో ఇంకా అందుబాటులో లేదు. ఒక రోజు సాయంత్ర సమయంలో మున్జీర్‌ తన కుమారుడిని ఎంతో ఆనందంగా ఆడిస్తున్న దృశ్యం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement