Saturday, May 4, 2024

Project K: మరో మూవీలో సూపర్ హీరోగా డార్లింగ్ ప్రభాస్

Happy Birth day Prabhas: ప్ర‌భాస్ పుట్టినరోజు సందర్భంగా డార్లింగ్ లేటెస్ట్ మూవీస్ కి సంబంధించిన అప్ డేట్ లతో సోషల్ మీడియా ఫుల్ జోష్ గా ఉంది. ఎక్కడ చూసినా డార్లింగ్ కు సంబంధించిన పోస్టర్లు.. విషెస్ కనిపిస్తున్నాయి. ఇన్ని ప్యాన్ ఇండియా ప్రాజెక్టులతో ఆయన జరుపుకుంటున్న గ్రేటెస్ట్ పుట్టినరోజు ఇది.

ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో కూడినవే. అలాగే ఒకదానితో ఒకటి సంబంధం లేని జోనర్ల నుంచి వస్తున్నాయి.. ‘బాహుబాలి’ని ఒక జానపద చిత్రంగా.. ‘ఆది పురుష్’ పౌరాణిక చిత్రం కాగా.. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ‘ప్రాజెక్టు K’ చేయనున్నారు ప్రభాస్.

ప్రాజెక్ట్ k లో ప్రభాస్ సూపర్ హీరోగా కనిపించనున్నార‌నే టాక్ వినిపిస్తోంది. ఈ రోజు వైజయంతీ మూవీస్ ప్రభాస్ కి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ.. ‘‘సూపర్ హీరో’’ అంటూ సంబోధించారు. దాంతో ఇది సూపర్ హీరో ఫిల్మ్ అనే విషయంలో క్లారిటీ ఇచ్చేసినట్టు అయ్యింది. ఈ సినిమాలో కథానాయికగా దీపికా పదుకొణె.. కీలకమైన పాత్రలో అమితాబ్ కనిపించనున్న‌ట్టు ఫిలిం న‌గ‌ర్ వ‌ర్గాల టాక్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement