Friday, May 3, 2024

ఇంగ్లండ్‌ తో మ్యాచ్‌కు టీమిండియా క్రికెట‌ర్లు రెడీ..

జింబాబ్వేపై గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా నవంబర్‌ 10న ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ నస్నద్దతపై టీమిండియా సిద్దమైంది.మెగా టోర్నీ సూపర్‌ -12 దశలో భారత్‌ ఆడిన చివరి మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. జింబాబ్వేపై గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ టీమిండియాకు కీలకం. అయితే అంతకుముందే పిచ్‌ పరిస్థితులకు త్వరగా స ర్దుబాటు కావడం మరీ ముఖ్యం. అడిలైడ్‌ వేదికగా ఇండియా ఒక మ్యాచ్‌ ఆడటం సానుకూలాంశం. కచ్చితంగా ఇది హై వోల్టేజి మ్యాచ్‌. మంచిగా ఆడితే సహజంగానే భారత్‌కు విజయం వరించవచ్చు.

అందుకు తగ్గట్లు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని టీమిండియా నిర్ణయించుకుంది. వరుసగా అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోవడంలో దినేష్‌ కార్తిక్‌ విఫలం కావడంతో జింబాబ్వేతో మ్యాచ్‌కు రిషబ్‌ పంత్‌కు తుది జట్టులో స్థానం దక్కింది. ఈ క్రమంలో డీకేను తప్పించడం జహీర్‌ స్పందిస్తూ దినేష్‌ కార్తిక్‌పై టీమ్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ చాలా ఆశలు పెట్టుకుంది. అయితే డీకే మాత్రం తీవ్రంగా నిరుత్సాహపరిచాడు. ఫినిషర్‌ పాత్రకు న్యాయం చేయలేకపోయాడు. దీంతో రిషబ్‌ పంత్‌కు అవకాశం ఇవ్వాల్సి వచ్చింది.

కుమార్‌ ధర్మసేన, పాల్‌ రీఫిల్‌ అంపైర్లు

- Advertisement -

ఇంగ్లండ్‌తో జరిగే సెమీ ఫైనల్‌కు అంపైర్లు కుమార్‌ ధర్మసేన, పాల్‌ రీఫిల్‌ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఐసీసీ పురుషుల టీ 20 ప్రపంచకప్‌ సెమీ ఫైనల్‌ దశకు మ్యాచ్‌ అధికారులను నియమించినట్టు ఐసీసీ ప్రకటించింది. ఇంగ్లండ్‌తో జరిగే సెమీ ఫైనల్‌కు, కుమార్‌ ధర్మ సేన, పాల్‌ రీఫిల్‌ ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్లుగా ఎంపికయ్యారు.
డేవిడ్‌ బూన్‌ మ్యాచ్‌ రిఫరీగా బాధ్యతలు చేపట్టనున్నాడు. క్రిస్‌ గఫానీ థర్డ్‌ అంపైర్‌గా వ్యవహరిస్తుండగా రాడ్‌ టక్కర్‌ నాలుగో అంపైర్‌గా వ్యవహరించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement