Sunday, May 5, 2024

నేడు సంపూర్ణ చంద్రగ్రహణం

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సర కార్తిక శుద్ధ పూర్ణిమ మంగళవారం అనగా ఆంగ్లమాసం తేదీ. 08-11-2022 నాడు రాహుగ్రస్త చంద్రగ్రహణము భరణి నక్షత్ర యుక్త మేష రాశి యందు సంభవించును. ఇందులో భాగంగా మిథునం, కర్కాటకం, వృశ్చికం, కుంభరాశి వారికి శుభ ఫలితం. అదే సమయంలో, మేషం, వృషభం, కన్య, మకర రాశుల కు అశుభ ఫలితం. మిగిలిన రాశుల వారు గ్రహణం వల్ల మధ్యస్థ ఫలితాలు పొం దుతారు.
చంద్రగ్రహణం సమయం
స్పర్శకాలం – మ. 02:38
మధ్య కాలం – సా. 04:28
మోక్షకాలం – సా. 06:18
ఆద్యంత పుణ్యకాలం – 03 గ. 40 ని.
సూతక కాల: ప్రారంభ సమయం: ఉ. 09:21
(ఈ లోపున పూజలు, భోజనాలు పూర్తి చేసుకోవాలి)
శుద్ధ మోక్ష అనంతరము రా. 06:18 తరువాత నిత్య భోజనములు జరుపు కొనవలెను.
చంద్రగ్రహణం ఎక్కడ కనిపిస్తుంది?
సంవత్సరం చివరి చంద్రగ్రహణం భారతదేశంతో సహా దక్షిణ/తూర్పు యూరప్‌, ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్‌, అట్లాంటిక్‌, హందూ మహాసముద్రంలో కనిపిస్తుంది.
గ్రహణ గోచారము : ఈ గ్రహణమును భరణీ నక్షత్రము వారును, అధమ ఫలము నిచ్చు రాశుల వారును చూడరాదు.
శుభ ఫలము: మిథున, కర్కాటక, వృశ్చిక, కుంభరాశుల వారలకు.
మధ్యమ ఫలము: సింహ, తుల, ధనస్సు, మీనరాశుల వారలకు.
అధమ ఫలము: మేష, వృషభ, కన్య, మకర రాశుల వారలకు
కావున మేష, వృషభ, కన్య, మకర రాశుల వారు కింద చెప్పిన విధంగా చేయాలి.
1.25 కేజి- మినుములు
1.25 కేజి- బియ్యం
వెండి చంద్ర బింబం
నీలివస్త్రం తెల్లవస్త్రం
మంచి ముత్యం 1/2 లీటరు పెరుగు
శుద్ధ మోక్షాంతరమున స్నానం చేసి బింబ దర్శనం చేసి దానాలు ఇచ్చుకోవచ్చును. లింగాభిషేకం చేయుట ద్వారా గ్రహణ దోష నివారణ లభించును.

Advertisement

తాజా వార్తలు

Advertisement