Saturday, May 4, 2024

Spl Story: ఎమ్మెల్యేలపై ఐటీ రైడ్స్.. సర్కారును దెబ్బతీసే కుట్రలో భాగమే అంటున్న ప్రతిపక్షాలు

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఈడీ, సీబీఐ వంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు ప్రతిపక్ష పార్టీలను టార్గెట్​ చేస్తూ దాడులు చేస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాల ఆరోపణలకు తగ్గట్టే పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ఈడీ దాడులను పరిశీలిస్తే వారి ఆరోపణలకు మరింత బలం చేకూరేలా ఉంది. ఇందులో భాగంగా గత వారం జార్ఖండ్​ వ్యాప్తంగా ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, వారి సహచరుల ఇళ్లల్లో ఆదాయపు పన్ను శాఖ పెద్ద మొత్తంలో నగదు, 100 కోట్ల కంటే ఎక్కవ విలువైన ఖాతాలు లేని లావాదేవీలను గుర్తించింది. అయితే.. జార్ఖండ్‌లో సీఎం హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర జరుగుతోందని ఎమ్మెల్యే జైమంగల్ ఫిర్యాదు చేసిన తర్వాత ఈ దాడులు మరింత తీవ్రమవడం గమనించవచ్చు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

జార్ఖండ్‌లోని రాంచీ, గొడ్డా, బెర్మో, దుమ్కా, జంషెడ్‌పూర్, చైబాసా, పాట్నా (బిహార్), గురుగ్రామ్ (హర్యానా), కోల్‌కతా (పశ్చిమ బెంగాల్)లలో ఈ నెలలో దాదాపు50 ప్రాంతాల్లో సోదాలు చేసినట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) మంగళవారం తెలిపింది. ఇది I-T డిపార్ట్ మెంట్‌కు విధాన నిర్ణేత సంస్థ.  ప్రధానంగా ఇద్దరు ఎమ్మెల్యేలు కుమార్ జైమంగల్(అనూప్ సింగ్),  ప్రదీప్ యాదవ్‌ ఇళ్లు, ఆఫీసులపై ఈ సోదాలు జరిపిన్టటు అధికారులు తెలిపారు.

ఇక.. బెర్మో సీటుకు చెందిన శాసనసభ్యుడు జైమంగల్ కూడా ఐటీ దాడులను ధ్రువీకరించారు. అయితే.. తాను ఈ పరిశోధనా బృందాలకు అన్నిరకాల సహకారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. జార్ఖండ్​ వికాస్​ మోర్చా పార్టీ (JVM-P) నుంచి విడిపోయి కాంగ్రెస్‌లో చేరిన యాదవ్, పోరియాహత్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముఖ్యమంత్రి హేమంత్ కేబినెట్​లో కాంగ్రెస్ భాగస్వామిగా ఉంది.

కాగా, బొగ్గు వ్యాపారం, రవాణా, సివిల్ కాంట్రాక్టుల అమలు, ఇనుప ఖనిజం వెలికితీత.. స్పాంజ్ ఐరన్ ఉత్పత్తిలో నిమగ్నమైన కొన్ని వ్యాపార సమూహాలపై ఈ దాడులు జరిపినట్టు CBDT తెలిపింది. తాము పరిశోధన చేసిన​ వారిలో రాజకీయంగా బహిర్గతం అయిన ఇద్దరు వ్యక్తులు, వారి సహచరులు ఉన్నారు అని అధికారులు తెలిపారు. ఇక.. ₹ 2 కోట్ల కంటే ఎక్కువ విలువైన నగదు స్వాధీనం చేసుకున్నామని, ఇప్పటి వరకు ₹ 100 కోట్లకు మించిన లెక్కలు చూపని లావాదేవీలు, పెట్టుబడులు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఈ సోదాల్లో పెద్ద సంఖ్యలో నేరాలను రుజువు చేసే పత్రాలు, డిజిటల్ రికార్డులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

- Advertisement -

ఈ సాక్ష్యాలపై ప్రాథమిక విశ్లేషణ, ఖర్చుల వివరాలు, నగదు రూపంలో రుణాల లావాదేవీలు, చెల్లింపులు, రసీదులు, ఉత్పత్తిని తక్కువ చేసే చూపే వంటి పలు రకాల పన్ను ఎగవేత విధానాలు ఉన్నాయని వారు వివరించారు. సివిల్ కాంట్రాక్టులలో నిమగ్నమై ఉన్న గ్రూపులలో ఒకటి సాధారణ ఖాతా పుస్తకాలను కూడా నిర్వహించలేదని తేలిందన్నారు. సంవత్సరం చివరిలో ముడిసరుకు, సబ్-కాంట్రాక్ట్ ఖర్చుల కొనుగోలుకు సంబంధించిన లావాదేవీలను ఎంట్రీ చేయడం ద్వారా వారి ఖర్చులు పెద్దమొత్తంలో చూపుతున్నారని.. స్వాధీనం చేసుకున్న ఆధారాలు కూడా నగదు రూపంలో పలు రకాల చెల్లింపులు జరిగాయని సూచిస్తున్నాయని CBDT అధికారులు తెలిపారు.

బొగ్గు వ్యాపారం, ఇనుప ఖనిజం వెలికితీత మొదలైన ఇతర గ్రూపుల విషయంలో భారీ విలువ కలిగిన ఇనుప ఖనిజం యొక్క లెక్కల్లోకి రాని స్టాక్ లభించినట్టు తెలుస్తోంది. దీనిపై ఇంకా అకౌంట్స్​ చూడలేదని సీబీడీటీ తెలిపింది. వీరంతా షెల్ కంపెనీల ద్వారా లావాదేవీలను చేయడం ద్వారా అసురక్షిత రుణాలు, షేర్ క్యాపిటల్ రూపంలో తన ఖాతాలోకి తీసుకోని డబ్బును కూడా చూపుతున్నారని వెల్లడయ్యింది.  

అయితే.. జార్ఖండ్‌లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని అధికార యూపీఏ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తూ జైమంగల్ తన పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఇర్ఫాన్ అన్సారీ, రాజేష్ కచ్చప్, నమన్ బిక్సల్ కొంగరి ఆగస్టులో పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఆ తర్వాత వారి బిజినెస్​లు, లావాదేవీలపై ఈ దాడులు తీవ్రమైనట్టు వారు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement