Wednesday, April 24, 2024

కార్తి 25వ సినిమా.. జపాన్ టైటిల్ ఫిక్స్

వరుసగా సినిమాలని సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు తమిళ హీరో కార్తి. తాజాగా కార్తి తన కొత్త సినిమాను పట్టాలెక్కించాడు. రాజమురుగన్‌ దర్శకత్వంలో కార్తి తన 25వ సినిమాను చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘జపాన్‌’ అనే పేరును ఫిక్స్‌ చేశారు. తాజాగా ఈ సినిమా గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. డ్రీమ్‌ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కార్తికు జోడీగా అను ఇమాన్యూయేల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. జీవి ప్రకాష్ కుమార్‌ సంగీతం అందిస్తున్నాడు. చెన్నైలో ఈ సినిమా ఘనంగా లాంచ్‌ అయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్‌ మొదలు పెట్టనుంది. ఈ చిత్రానికి రవివర్మన్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement