Sunday, May 5, 2024

రెడీ అవుతోన్న సింగం4

తమిళ స్టార్ హీరో సూర్య.. శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నారు. శివ ఈ చిత్రాన్ని పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కించబోతున్నారు. ఆ మధ్యన విడుదలైన మోషన్ పోస్టర్ తోనే అంచనాలు పెరిగిపోయాయి. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ కూడా ప్రారంభం ఐంది. సూర్యకి క్లాస్ ఆడియన్స్ తో పాటు మాస్ అభిమానులు కూడా ఉన్నారు. వారి కోసం సూర్య సింగం లాంటి మాస్ చిత్రాలు చేయడం చూస్తూనే ఉన్నాం. సింగం సిరీస్ తో సూర్య ఒక సూపర్ కాప్ లాగా మారిపోయారు. సింగం సిరీస్ లో వచ్చిన మూడు చిత్రాలు ప్రేక్షకులని బాగా అలరించాయి. ఇప్పుడు సింగం 4 రెడీ అవుతున్నట్లు బలమైన న్యూస్ వినిపిస్తోంది. 2010లో సింగం మొదటి భాగం.. 2013లో రెండవ భాగం.. 2017లో మూడవ భాగం రిలీజ్ అయ్యాయి. ఇటీవల డైరెక్టర్ హరి సింగం 4 కి సంబంధించిన స్టోరీ లైన్ సూర్యకి వినిపించారట. స్టోరీ లైన్ నచ్చడంతో డెవెలప్ చేయమని సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీనితో సూర్య అభిమానులు సంతోషంలో మునిగిపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement