Saturday, April 27, 2024

అక్టోబర్‌లో 731 రైల్వే స్టేషన్లలో.. స్వచ్ఛభారత్‌ ప్రత్యేక కార్యక్రమం పూర్తి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ :దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో అక్టోబర్‌ నెలలో సుమారు 731 రైల్వే స్టేషన్ల పరిధిలో స్వచ్ఛ భారత్‌ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. అన్ని స్టేషన్లలో పరిశుభ్రతను మెరుగు పరిచేందుకు ఉద్దేశించి చేపట్టిన ఈ కార్యక్రమంలో దమ రైల్వే అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైల్వే మంత్రిత్వశాఖ నిర్దేశించిన విధంగా అన్ని రంగాలలో పని చేసే ప్రదేశాల్లో మెరు గెన పని, సంస్కృతి ద్వారా పరిశుభ్రత, సుపరి పాలనకు నాంది పలికేలా దక్షిణ మధ్య రైల్వే తన జోన్‌ పరిధిలో అంతటా పెద్ద ఎత్తున అక్టోబర్‌ 2022లో ”ప్రత్యేక ప్రచారం 2.0” పేరిట చేపట్టింది. దక్షిణ మధ్య రైల్వేలోని ఆరు డివిజన్లు సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, గుంతకల్‌ మరియూ నాందేడ్‌ లలోని 731 రైల్వే స్టేషన్లలో ఈ ప్రచారం నిర్వహించింది.

స్వచ్ఛ భారత్‌ చొరవతో కొనసాగుతూ, భారత ప్రభుత్వం దేశంలోని పరిసరాలు, పరిశుభ్రతను మరింతగా విస్తరింపజేయడానికి మరియు మెరుగుపర చడానికి అనేక ప్రచారాలు, కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా ఈ లక్ష్యం కోసం పరిశుభ్రతను మరింత మెరుగుపరచడానికి అపరిస్కృతాన్ని తగ్గించడానికి అలాగే పని – సంస్కృతిని మెరుగుపరచడానికి స్వచ్ఛ భారత్‌ ఈ ప్రత్యేక ప్రచారం ప్రారంభించారు. ప్రత్యేక ప్రచార అవగాహన 2.0 కింద అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో సమర్దవంతమైన పరిశుభ్రతను నిర్దారించడానికి యంత్రాలతో శుభ్రతను బలొపేతం చేయడంపై దృష్టి సారించారు. వ్యర్థ పదార్థాలను సక్రమంగా పారవేయడం, రైల్వే ప్రాంగణాల్లో పరిశు భ్రతను బాధ్యతాయుతంగా ఉండేలా చూశారు. పరిశుభ్రతను బాధ్యతా యుతంగా ఉండేందుకు ప్రయాణికులకు సైతం అవగాహన కల్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement