Sunday, May 19, 2024

రెండో వన్డేలో సూర్యకుమార్ కు చోటు..!

ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో భారీ విజయం సాధించిన టీమిండియా రెండో వన్డే కోసం పలు మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. రెండో వ‌న్డే కోసం టీమిండియా రెండు మార్పులు చేసే అవ‌కాశాలు కనిపిస్తున్నాయి. ఇప్ప‌టికే గాయం కార‌ణంగా మిగ‌తా వ‌న్డేల‌కు శ్రేయ‌స్ అయ్య‌ర్ దూరం కావ‌డంతో అత‌ని స్థానంలో సూర్య‌కుమార్ యాద‌వ్‌ను తీసుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే టీ20 అరంగేట్రం చేసిన అత‌డు.. ఈ మ్యాచ్‌తో వ‌న్డేల్లోనూ నేష‌న‌ల్ టీమ్ త‌ర‌ఫున తొలి మ్యాచ్ ఆడ‌నున్నాడు. ఇక తొలి వ‌న్డేలో విఫ‌ల‌మైన స్పిన్న‌ర్ కుల్‌దీప్ యాద‌వ్ స్థానంలో లెగ్‌స్పిన్న‌ర్ యజువేంద్ర చాహ‌ల్‌కు చోటు ద‌క్కే అవ‌కాశం క‌నిపిస్తోంది. తొలి వ‌న్డేలో ఘ‌న విజయం సాధించి ఊపు మీదున్న కోహ్లి సేన‌.. రేపు జరగబోయే రెండో వ‌న్డేలోనూ గెలిచి మూడు వ‌న్డేల సిరీస్‌ను గెల‌వాల‌ని భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement