Friday, April 26, 2024

కామర్స్​ సెక్రెటరీగా సీనియర్​ ఐఏఎస్​ అధికారి.. బాధ్యతలు చేపట్టిన సునీల్​ బర్త్వాల్​

వాణిజ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సునీల్ బర్త్వాల్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బీహార్ కేడర్‌కు చెందిన 1989 బ్యాచ్ అధికారి అయిన బార్త్వాల్ గతంలో కార్మిక, ఉపాధి కార్యదర్శిగా పనిచేశారు. ఛత్తీస్‌గఢ్ కేడర్‌కు చెందిన 1987-బ్యాచ్ IAS అధికారి అయిన సుబ్రమణ్యం స్థానంలో సునీల్ బర్త్వాల్ నియామకం అయ్యారు. రెండేళ్ల కాలానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.

కాగా, బార్త్వాల్ కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ఆర్థిక, సామాజిక భద్రత, మౌలిక సదుపాయాలు, గనులు, ఉక్కు, ఇంధనం.. రవాణా రంగాలలో వివిధ పరిపాలనా పదవులను నిర్వహించారు. దేశంలోనే అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థ అయిన ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో సీఈవోగా ఉన్న సమయంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత ఈ ఐఏఎస్ అధికారికి దక్కింది. సునీల్ బర్త్వాల్ ఈపీఎఫ్‌వోలో అనేక సంస్కరణల్లో కీలక పాత్ర పోషించారు. దీని ఫలితంగా మరింత సమర్థవంతమైన, పారదర్శకమైన.. డెలివరీ ఓరియెంటెడ్ ఆర్గనైజేషన్‌గా మారిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement