Sunday, April 28, 2024

ప‌రువు న‌ష్టం దావా – మ‌ల్లిఖార్జున ఖర్గేకి స‌మ‌న్లు..

బెంగుళూరు: క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో భ‌జ‌రంగ్‌ద‌ళ్‌ను బ్యాన్ చేస్తామ‌ని కాంగ్రెస్ పార్టీ చీఫ్ మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో పంజాబ్ కోర్టులో ఖ‌ర్గేపై ప‌రువున‌ష్టం దావా పిటిష‌న్ దాఖ‌లైంది. హిందూ సుర‌క్షా ప‌రిష‌ద్ భ‌జ‌రంగ్‌ద‌ళ్ హింద్ వ్య‌వ‌స్థాప‌కుడు హితేశ్ భ‌ర‌ద్వాజ్ కాంగ్రెస్ చీఫ్ ఖ‌ర్గేపై వంద కోట్ల ప‌రువున‌ష్టం దావాను ఫైల్ చేశారు. భ‌జ‌రంగ్‌ద‌ళ్‌ను జాతీయ‌ వ్య‌తిరేక సంస్థ‌గా కాంగ్ర‌స్ పార్టీ ఆరోపించింద‌ని, క‌ర్ణాట‌క‌లో అధికారంలోకి వ‌చ్చాక భ‌జ‌రంగ్‌ద‌ళ్‌ను బ్యాన్ చేస్తామ‌ని ఆ పార్టీ పేర్కొన్న‌ట్లు హితేశ్ త‌న ప‌రువున‌ష్టం దావాలో పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేజీ నెంబ‌ర్ 10లో ఉన్న అంశాల ఆధారంగా కోర్టును ఆశ్ర‌యించిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో సంగ్రూర్ కోర్టు కాంగ్రెస్ నేత‌కు స‌మ‌న్లు జారీ చేసింది. జూలై ప‌దో తేదీన కోర్టుకు హాజ‌రుకావాలంటూ ఖ‌ర్గేను సివిల్ జ‌డ్జి ర‌మ‌ణ్‌దీప్ కౌర్ ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement