Sunday, May 19, 2024

ప్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. న‌ష్టాల‌తో ప్రారంభ‌మై

గత నాలుగు సెషన్లలో లాభాలు గడించిన స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నాడు ప్లాట్‌గా ముగిశాయి. ఉదయం నుంచే మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. చివరలో స్వల్ప లాభాల్లోకి వెళ్లిన మార్కెట్లకు మళ్లిd కొనుగోళ్లు పెరగడంతో లాభాలు నిలబడలేదు. చివరకు మార్కెట్లు ప్లాట్‌గా ముగిశాయి. వరసగా మార్కెట్లు లాభపడటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఇలాంటి పరిస్థితే కనిపించింది. మంగళవారం నాడు సూచీలు అతి స్వల్ప లాభాల్లో ముగిశాయి.

సెన్సెక్స్‌ 20.86 పాయింట్లు లాభపడి 58136.36 వద్ద ముగిసింది. నిఫ్టీ 5.40 పాయింట్లు లాభపడి 17345.45 వద్ద ముగిసింది.
బంగారం 10 గ్రాముల ధర 321 రూపాయిలు పెరిగి 51,584 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో 315 రూపాయిలు తగ్గి 58,011 రూపాయిల వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకు విలువ 78.71 వద్ద ముగిసింది. మంగళవారం నాడు రూపాయి 49 పైసలు బలపడింది.

బలపడిన రూపాయి
డాలర్‌తో రూపాయి విలువ 80 రూపాయలకుపైగా ఉన్న స్థితి నుంచి కొంత కొలుకుంది. మంగళవారం నాడు రూపాయి 78.71 వద్ద సెటిల్‌ అయ్యింది. ఈ నెలలో ఇంత భారీగా రూపాయి లాభపడటం ఇదే తొలిసారి. సోమవారం నాడు డాలర్‌తో రూపాయి మారకం విలువ 79.03 వద్ద ముగిసింది. ముడి చమురు ధర తగ్గడం, విదేశీ వాణిజ్యం బ్యాలన్సె షీట్‌ మెరుగుపడటం , విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి మన ఈక్విటీ మార్కట్లలో పెట్టుబడులు పెట్టడం వంటి కారణాలతో రూపాయి బలపడింది.

లాభపడిన షేర్లు
ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఏషియా పెయింట్స్‌, ఎన్‌టీపీసీ, మారుతి సుజుకీ, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హిందూస్థాన్‌ యూనిలీవర్‌, పవర్‌ గ్రీడ్‌ కార్పోరేషన్‌, ఎస్‌బీఐ షేర్లు లాభపడ్డాయి.

నష్టపోయిన షేర్లు
యూపిఎల్‌, హీరో మోటోకార్ప్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, బ్రిటానియా, టెక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, హిండాల్కో, టాటా స్టీల్‌, ఎల్‌ అండ్‌ టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ , భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టపోయాయి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement