Sunday, May 5, 2024

సొంత వ్యాపారల కోసమే 5జీ.. డేటా సెంటర్ల కోసమేనన్న అదానీ

సోమవారం ముగిసిన 5జీ వేలంలో అతి తక్కువ స్పెక్ట్రమ్‌ను సొంతం చేసుకున్న అదానీ , దాన్ని పూర్తిగా సొంత వ్యాపారాలు, డేటా సెంటర్ల కోసమే వినియోగించనున్నట్లు ప్రకటించారు. ఈ వేలంలో అదానీ డేటా నెట్‌వర్క్స్‌ 212 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసింది. కంపెనీ వ్యాపారాలు, డేటా సెంటర్ల అవసరాల కోసం ఏర్పాటు చేసే ప్రయివేట్‌ నెట్‌వర్క్‌ కోసం దీన్ని ఉపయోగిస్తామని కంపెనీ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ వెల్లడించారు. అదానీ కంపెనీ 212 కోట్లతో 26 గిగాహెడ్జ్‌ బ్యాండ్‌లో 400 మెగాహెడ్జ్‌ స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసింది. ఇది మొత్తం అమ్ముడైన స్పెక్ట్రమ్‌లో 1 శాతం కంటే తక్కువ.

ముంబాయి, ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, కర్నాటక, తమిళనాడు, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో కంపెనీ ప్రయివేట్‌ నెట్‌వర్క్‌ కోసం ఈ స్పెక్ట్రమ్‌ను ఆదానీ గ్రూప్‌ ఉపయోగించనుంది. అదానీ గ్రూప్‌లో ఉన్న పోర్టులు, విమానాశ్రయాలు, గ్యాస్‌, విద్యుత్‌, సిమెంట్‌ ఇలా అనేక రంగాల్లో ఉన్న కంపెనీల అవసరాల కోసం దీన్ని ఉపయోగించనుంది. ఇందు కోసం ఒక యాప్‌ను కూడా తీసుకు వచ్చేందుకు నిర్ణయించింది. అదానీ గ్రూప్‌ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కూడా కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్‌ను వినియోగించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement