Monday, May 20, 2024

సుధీర్ బర్త్‌డే స్పెషల్.. ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఫస్ట్ గ్లింప్స్

హీరో సుధీర్ బాబు పుట్టినరోజు సందర్భంగా అతడు నటించిన తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’ నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. లైటింగ్ మెన్ పాత్రలో సుధీర్ బాబు అదరగొట్టాడు. ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఆనంది హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీకి మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నాడు. భ‌లే మంచి రోజు, ఆనందో బ్ర‌హ్మ‌, యాత్ర చిత్రాల నిర్మాత‌లు విజ‌య్ చిల్లా, శ‌శిదేవి రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement