Tuesday, May 7, 2024

ఆక‌ట్టుకుంటోన్న.. సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న గ్లింప్స్

ద‌ర్శ‌కుడు రామ్ అబ్బ‌రాజు రూపొందిస్తున్న చిత్రం సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌. ఈ చిత్ర షూటింగ్ ఆఖ‌రిద‌శ‌లో ఉంది. ఈ మూవీలో హీరో శ్రీవిష్ణు న‌టిస్తున్నాడు.ఈ మూవీ నుండి గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్ . హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్ దండ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపి సుందర్‌ స్వరకల్పనలో రూపొందుతున్న ఈ సినిమా వేసవిలో హాస్యపు విందులు వడ్డించడానికి ముస్తాబువుతుంది.ఈ గ్లింప్స‌ప్ తో సినిమా ఎలా ఉంటుందో కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్లకి పలు ప్రాబ్లెమ్స్‌ ఉంటాయన్న మాట వాస్తవం. కానీ ఈ సినిమాలో మాత్రం శ్రీవిష్ణుకు ఎవ్వరికి లేని వింత ప్రాబ్లెమ్‌ను ఫేస్‌ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరీ ఆ వింత ప్రాబ్లెమ్‌ ఎంటో తెలియాలంటే సినిమా వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అగ్ర నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌ రూపొందించిన సినిమా కావడంతో క్వాలిటీ విషయంలో రాజీ పడినట్లు కనిపించలేదు. ఫస్ట్‌ ప్రేమ్‌ నుండి లాస్ట్‌ ఫ్రేమ్‌ వరకు గ్లింప్స్‌ చాలా రిచ్‌గా కనిపించింది. గోపి సుందర్‌ మ్యూజిక్‌ కూడా ఫ్రెష్‌గా ఉంది. అవుట్‌ అండ్‌ అవుట్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విష్ణుకు జోడీగా బిగిల్‌ ఫేమ్‌ రెబా మోనికా జాన్‌ నటిస్తుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement