Friday, April 26, 2024

సిటాడేల్ షూట్ లో.. స‌మంత‌కి గాయాలు

ఇప్పుడిప్పుడే అనారోగ్యం బారినుండి కోలుకుంటోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత‌. కాగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో హిందీ సిరీస్ ‘సిటాడేల్’ షూటింగ్ యాక్షన్ కోసం స్టార్ హీరోయిన్ సమంత శిక్షణ పొందుతోంది. అయితే సెట్స్ లో ఆమె చేతికి గాయం అయిందని తెలిపే ఫోటోను సమంత తన అకౌంట్ లో పంచుకుంది. ఆమె చేతులకు గాయాలు, రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. యాక్షన్ సీన్స్ కోసం ఇంతలా కష్టపడుతుందని ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు. హీరోయిన్ సమంత గత కొన్నాళ్ల నుంచి శారీరకంగా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమాలకు.. సోషల్ మీడియాకు సైతం దూరంగా ఉంటూ వస్తుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement