Wednesday, November 29, 2023

మద్యం మత్తులో తండ్రిని చంపిన కొడుకు.. జీడిమెట్లలో ఘటన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాజధాని హైదరాబాద్‌లో దారుణమైన ఘటన వెలుగు చూసింది. జన్మనిచ్చిన తండ్రపట్ల ఓ కుమారుడు కర్కశంగా వ్యవహరించిన ఘటన జీడిమెట్ల ప్రాంతంలో జరిగింది. అనారోగ్యంతో బాధ పడుతున్న తన తండ్రిని కిరాతంగా కొట్టి చంపాడు. కుత్బుల్లాపూర్‌లో ఉంటున్న సత్యనారాయణ (63) గత ఐదేళ్లుగా పక్షవాతంతో ఇబ్బంది పడుతూ మంచానికి పరిమితమయ్యాడు. మద్యంలో మత్తులో తండ్రితో గొడవ పడిన తనయుడు సురేష్‌ అగ్రహంతో ఊగిపోయి కర్రతో, బెల్టుతో తండ్రిపై దాడికి తెగపడ్డాడు. తీవ్ర గాయాల పాలైన సత్యనారాయణ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తండ్రిని చంపిన తనయుడు సురేష్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement