Thursday, May 2, 2024

ఓయూలో సోలార్‌ ప్లాంట్‌! విద్యుత్‌ అవసరాలు తీర్చుకునేందుకు ప్లాన్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: విద్యుత్‌ అవసరాల నిమిత్తం ఉస్మానియా యూనివర్సిటీలో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు వర్సిటీ ప్రణాళికలు రచిస్తోంది. ఈమేరకు తెలంగాణ స్టేట్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, తెలంగాణ స్టేట్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ అండ్‌ నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌తో చర్చలు జరుపుతోంది.

ప్రస్తుతం ఉస్మానియా వర్సిటీకు సుమారు నెలకు రూ.కోటి వరకు విద్యుత్‌ బిల్లు వస్తోంది. ఈ ఖర్చును తగ్గించుకునేందుకుగానూ సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. వర్సిటీకి సరిపడా విద్యుత్‌ను వినియోగించుకొని మిగిలిన అదనపు విద్యుత్‌ను గ్రిడ్‌కు బదిలీచేయడంతో వర్సిటీకి ఆదాయం సమకూరేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement