Sunday, May 12, 2024

ఆక‌ట్టుకుంటోన్న సీతా రామం టీజ‌ర్

హీరో దుల్కర్ సల్మాన్ – గార్జియస్ బ్యూటీ మృణాళ్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం సీతా రామం. ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’ అనే ట్యాగ్‪ లైన్ లో రూపొందుతోన్న ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా కీలక పాత్ర పోషించింది.ఈ చిత్రం నుండి టీజ‌ర్ రిలీజ్ అయింది. సెన్సిబుల్ లవ్ స్టోరీల స్పెషలిస్ట్ హను రాఘవపూడి ఈ రొమాంటిక్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై అశ్విని దత్ – ప్రియాంక దత్ నిర్మిస్తున్నారు. తెలుగు.. తమిళం.. మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్నారు. సీతా రామం అనేది 1965 బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడిన మ్యాజికల్ లవ్ స్టోరీ అని టీజర్ చూస్తే అర్థం అవుతోంది. కాశ్మీర్ అందాలను సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ అద్భుతంగా క్యాప్చర్ చేశారు. ప్రొడక్షన్ డిజైన్ కూడా అత్యుత్తమంగా ఉంది. దీనికి శ్రేయాస్ కృష్ణ అదనపు సినిమాటోగ్రఫీని అందించారు. విశాల్ చంద్రశేఖర్ తన స్కోర్ తో విజువల్స్ స్థాయిని పెంచారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement