Tuesday, May 7, 2024

Tiger Shark – స‌ర‌దాగా ఈత‌కు దిగితే షార్క్ మింగేసింది…వీడియోతో

కైరో – స‌ర‌దాగా త‌న ప్రియురాలితోక‌లిసి ఈదుతున్న యువకుడ్ని సొరచేప తినేసింది. ఈజిప్ట్‌లోని హుర్ఘదా బీచ్‌ రిసార్ట్‌ వద్ద ఈ సంఘటన జరిగింది. వివ‌రాల‌లోకి వెళితే, రష్యాకు చెందిన 23 ఏళ్ల వ్లాదిమిర్ పోపోవ్ తన కుటుంబంతో కలిసి ఈజిప్ట్‌ను సందర్శించాడు. ఎర్ర సముద్రం తీరంలోని రిసార్ట్‌లో బస చేసిన అతడు ప్రియురాలితో కలిసి బీచ్‌లో ఈత కొట్టాడు. ఇంతలో ఒక టైగర్‌ షార్క్‌ ఆ బీచ్‌లో కనిపించింది. ఇది చూసిన కొందరు షార్క్‌ అని అరిచిన ఈదుతున్న వారిని హెచ్చరించేందుకు ప్రయత్నించారు. కాగా, ఆ షార్క్‌ అంతలోనే వ్లాదిమిర్ పోపోవ్‌ను సమీపించి అతడిపై దాడి చేసింది. దీంతో డాడీ రక్షించు అంటూ అతడు కేకలు వేశాడు. ఈదుతూ ఒడ్డుకు వచ్చేందుకు తెగ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. రిసార్ట్‌ సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. ఆ యువకుడ్ని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆ యువకుడ్ని నమిలిన షార్క్‌ అనంతరం అమాంతం మింగేసింది. అయితే ఆ యువకుడి ప్రియురాలు మాత్రం షార్క్‌ దాడి నుంచి తప్పించుకుంది. ఈదుకుంటూ ఒడ్డుకు చేరింది.


ఇది ఇలా ఉంటే ర‌ష్యా యువకుడ్ని తినేసిన టైగర్‌ షార్క్‌ను పట్టుకున్నట్లు ఈజిప్ట్ పర్యావరణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ షార్క్‌ను ప్రయోగశాలలో పరిశీలిస్తామని పేర్కొంది. మరోవైపు ఈ సంఘటనపై రష్యా స్పందించింది. రష్యా పర్యాటకులు నీటిలోకి దిగేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, నిషేధిత బీచ్‌లలో ఈతకు దిగవద్దని సూచించింది.

https://twitter.com/nabilajamal_/status/1667039099851780097
Advertisement

తాజా వార్తలు

Advertisement