Friday, April 26, 2024

శాకుంతలం నుంచి అప్డేట్ -గ్లింప్స్‌ వీడియో లాంఛ్‌

డైరెక్టర్‌ గుణ శేఖర్‌ పీరియాడిక్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిస్తున్న చిత్రం శాకుంతలం. స్టార్‌ హీరోయిన్‌ సమంత లీడ్‌ రోల్‌లో నటిస్తుంది. . మలయాళ నటుడు దేవ్‌ మోహన్‌ కీ రోల్‌లో నటిస్తున్నారు. అప్‌కమింగ్‌ పాన్‌ ఇండియా సినిమాల జాబితాలో ఉన్న శాకుంతలం నుంచి క్రేజీ అప్‌డేట్‌ అందించింది గుణ శేఖర్‌ టీం. శాకుంతలం చిత్రాన్ని నవంబర్‌ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. విడుదల తేదీని ప్రకటిస్తూ చిన్న గ్లింప్స్‌ వీడియోను లాంఛ్‌ చేసింది. ఫీ మేల్‌ ఓరియెంటెడ్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనన్య నాగళ్ల, అదితీ మోహన్‌, ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని గుణ టీమ్‌ వర్క్స్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శాకుంతలం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.


.

Advertisement

తాజా వార్తలు

Advertisement