Wednesday, May 8, 2024

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య రెండో దఫా చర్చలు.. మళ్లీ అవే డిమాండ్లు

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య భీకర యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల ప్రతినిధుల బృందం మరోసారి భేటీకి నిర్ణయించింది. బుధవారం మళ్లీ ఉక్రెయిన్‌-రష్యా దేశాలు శాంతి చర్చలు జరపనున్నారు. తొలి దఫా చర్చలు అసంపూర్ణం కావడంతో.. రష్యా సేన దూకుడు పెంచింది. ఈ క్రమంలో రెండో దఫా చర్చలకు ఇరు దేశాలు సిద్ధం అవుతున్నట్టు సమాచారం. మళ్లీ రష్యాయే చర్చలకు ఆహానించింది. బలగాల ఉప సంహరణ, కాల్పుల విరమణ ఉక్రెయిన్‌ డిమాండ్‌ కాగా.. నాటోలో చేరొద్దని, దీనిపై లిఖితపూర్వకంగా హామీ ఇవాలనేది రష్యా డిమాండ్‌. మళ్లీ ఇవే విషయాలపై చర్చలు జరగనున్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే తమ లక్ష్యం నెరవేరే వరకు వెనక్కి తగ్గే ఉద్దేశం లేదని రష్యా తాజాగా తేల్చి చెప్పింది.

ఈ సమయంలో మళ్లీ నేడు జరిగే చర్చలు విజయవంతం అవుతాయా..? లేవా..? అన్నది సందేహంగా మారాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాట్లాడినట్టు సమాచారం. యుద్ధం ఆపేయాలని కోరినట్టు తెలుస్తున్నది. రష్యాపై ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెరగడంతో మళ్లిd రెండో దఫా చర్చలు నిర్వహించేందుకు ముందుకొచ్చినట్టు తెలుస్తున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement