Sunday, April 28, 2024

పాఠశాల విద్యార్థులకు 30,107 జతల షూస్‌..గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డ్..

హైదరాబాద్ : రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమ కోసం సాఫ్ట్‌వేర్ , డాటా ఎనలిటిక్స్‌ అందించడంలో అంతర్జాతీయంగా అగ్రగామి సంస్థ రియల్‌ పేజ్‌ నేడు బాలల దినోత్సవం పురస్కరించుకుని తమ నూతన సోషల్‌ ఇంపాక్ట్‌ కార్యక్రమం ‘రియల్‌ సోల్స్‌ ఫ్రమ్‌ రియల్‌ సౌల్స్‌’ ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం నూతన గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ టైటిల్‌ ను సైతం సృష్టించింది. 60వేల షూస్‌తో వరుస ఏర్పాటు చేయడంతో పాటుగా ఈ 30,107 జతల షూస్‌ను తెలంగాణా ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలల విద్యార్థులకు అందజేశారు. తద్వారా 30,107 మంది పాఠశాల విద్యార్థుల జీవితాలనూ స్పృశించారు. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏడు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ షూస్‌ను హైదరాబాద్‌ చుట్టు పక్కల ప్రాంతాలలోని 100కు పైగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి అల్లిపురం వెంకటేశ్వర్‌ రెడ్డి, ఛైర్మన్‌, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణా పాల్గొన్నారు.

రియల్‌ పేజ్‌ వద్ద, వినూత్నమైన కార్యక్రమాలైనటువంటి ‘రియల్‌ సోల్స్‌ ఫ్రమ్‌ రియల్‌ సౌల్స్‌’వంటివి బాధ్యతాయుతమైన కార్పోరేట్‌ పౌరునిగా నిలువాలనే మా సిద్ధాంతాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ మహోన్నతమైన కారణంలో నేను కూడా కూడా భాగం కావడం గర్వంగా భావిస్తున్నాను. ఈ అసాధారణ ఫీట్‌ సాధించిన రియల్‌ పేజ్‌ ఇండియా టీమ్‌ను అభినందిస్తున్నాను’’ అని డానా జోన్స్‌, సీఈఓ, రియల్‌ పేజ్‌ అన్నారు. సందీప్‌ శర్మ, ఎస్‌వీపీ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, రియల్‌ పేజ్‌ ఇండియా మాట్లాడుతూ ‘‘ ఇది కేవలం రికార్డు సృష్టించడం వరకూ మాత్రమే కాదు, అంతకు మించి . ఈ రికార్డు ప్రయత్నానికి ఆవల, ఈ కార్యక్రమంలో భాగంగా తమ నూతన జత షూస్‌ను అందుకున్న ప్రతి నిరుపేద చిన్నారి మోములోనూ చిరునవ్వు చూడాలని ప్రతి రియల్‌ పేజర్‌ కోరుకున్నాడు. నేడు అది సాధ్యమైంది. ఈ గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ టైటిల్‌, 2021 సంవత్సరాన్ని మరింత అద్భుతంగా మలిచింది , మా లబ్ధిదారులకు అంతా శుభం జరగాలని రియల్‌ పేజ్‌ ఇండియా ఆకాంక్షిస్తుంద‌న్నారు. గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ గుర్తింపును పొందిన రియల్‌ పేజ్‌ బృందాన్ని నేను అభినందిస్తున్నాను’’ అని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్‌ రంజన్‌ ఐఏఎస్‌ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement