Friday, April 26, 2024

ఎస్సీ గురుకుల ఇంటర్‌ ఫస్టియర్‌ ఎంట్రన్స్‌ ఫలితాలు.. విడుదల చేసిన మంత్రి కొప్పుల

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : సోషల్‌ వెల్ఫేర్‌ (ఎస్సీ) గురుకులాలలో ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌లో చేరేందుకుగానూ (ఆర్జేసీ సెట్‌-2022) నిర్వహించిన ఎంట్రన్స్‌ ఫలితాలను షెడ్యూల్‌ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ విడుదల చేశారు. మొత్తం 19,360 సీట్లకుగానూ ఫిబ్రవరి 20న నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షకు 60,173 మంది విద్యార్థినీ విద్యార్థులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫలితాలను మంత్రి శనివారం రాత్రి కరీంనగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కొప్పుల, సొసైటీ కార్యదర్శి రొనాల్ల్‌ రాస్‌లు అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. మెరిట్‌ సాధించిన విద్యార్థులు ఈనెల 11 నుంచి 21వ తేదీ వరకు తమకు కేటాయించిన కాలేజీలో చేరాల్సి ఉంటుంది. కుల, ఆదాయ, బదలీ, స్టడీ సర్టిఫికెట్‌తో విద్యార్థులు సకాలంలో హాజరు కావాల్సి ఉంటుందని సొసైటీ జాయింట్‌ సెక్రెటరీ శక్రు నాయక్‌ తెలిపారు. విద్యార్థులు మరిన్ని వివరాల కోసం www.tswre is.ac.in , www.tswrjc.cgg.gov.in వెబ్‌సైట్లను వీక్షించాలని ఆయన సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement