Friday, May 3, 2024

రష్యాకు ఎదురుదెబ్బ.. ఐరాసలో ఆ దేశ రాయబారి రాజీనామా..

కీవ్‌:ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్న రష్యాకు ఆది, సోమవారాలలోఎదురుదెబ్బలు తగిలాయి. ఐక్యరాజ్య సమితిలో ఆ దేశ రాయబారి బోరిస్‌ బొండరెవ్‌ సోమవారం రాజీనామా చేశారు. ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో ఆయన తీవ్ర అసంతృప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. కాగా ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఇతర దౌత్యవేత్తలు కూడా రాజీనామా చేయాలన్న డిమాండ్‌ ఊపందుకుంది. మరోవైపు రష్యా స్వాధీనం చేసుకున్న చెర్నోబిల్‌కు సమీపంలోని ఉక్రెయిన్‌ పట్టణం ఎనెర్‌హోడర్‌లో ఆదివారం పేలుళ్లు సంభవించాయి.

ఇక్కడ రష్యా నియమించిన మేయర్‌ అండ్రీ షెవ్చిక్‌, అతని అంగరక్షకులు ఈ పేలుళ్లలో తీవ్రంగా గాయపడ్డారు. ఆండ్రీ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని రష్యా అధికారులు ధ్రువీకరించారు. వీరిని రష్యా స్వాధీనంలోని మెలిటోపోల్‌కు తరలించి చికిత్స చేస్తున్నారు. కాగా తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో రష్యా దాడులు ముమ్మరం చేసిందని, అందువల్ల ఈ పరిస్థితుల్లో కాల్పుల విరమణకు సిద్ధంగా లేమని ఉక్రెయిన్‌ మరోసారి స్పష్టం చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement