Thursday, May 23, 2024

RR vs RCB | టాస్ గెలిచిన రాజ‌స్థాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఆర్సీబీదే !

ఐపీఎల్ 2024 మ్యాచ్ లు తీవ్ర ఉత్కంఠ రేపుతూ క్రికెట్ అభిమానులను అలరిస్తున్నాయి. ఇక, నేటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు మొద‌ట‌ బౌలింగ్ ఎంచుకుంది. జైపూర్‌లోని సవాయ్ మన్ సింగ్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ మరి కొద్ది సేప‌ట్లో ప్రారంభం కానుంది.

జ‌ట్ల వివరాలు :

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు :

ఫాఫ్ డు ప్లెసిస్ (c), విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (wk), సౌరవ్ దిలీప్‌సింగ్ చౌహాన్, మహ్మద్ సిరాజ్, మయాంక్ దాగర్, రీస్ టాప్లీ, యశ్ దయాల్.

రాజస్థాన్ రాయల్స్ :

జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (c & wk), రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, నాండ్రే బర్గర్, యుజ్వేంద్ర చాహల్.

- Advertisement -

కాగా, ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ రాజస్థాన్‌ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. మరో వైపు, బెంగళూరు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 ఓటములను చవి చూసింది. దీంతో పాయింట్ల టేబుల్ లో ఆర్సీబీ 7వ స్థానంలో నిలిచింది. రాజస్తాన్ రాయల్స్ మూడుకి మూడింట గెలిచి టేబుల్ లో రెండో స్థానంలో ఉంది.

కెప్టెన్ సంజు శాంసన్ జట్టుని సమర్థవంతంగా నడిపిస్తున్నాడు. అయితే యశస్వి జైస్వాల్ ఇంకా ఫామ్ లోకి రాలేదు. షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్ రాణిస్తున్నారు. బౌలింగ్ లో చాహల్, నవదీప్ సైనీ, సందీప్ శర్మ, కుల్దీప్ వంటి బౌలర్లు ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే ఆంశం.

ఇక బెంగళూరు విషయానికి వస్తే విరాట్ కొహ్లీ, దినేష్ కార్తీక్ ఇద్దరిపైనే జట్టు ఆధారపడినట్టు కనిపిస్తోంది. కెప్టెన్ డుప్లెసిన్ ఇంకా తన స్థాయికి తగిన ఆట చూపించలేదు. బౌలర్లు కూడా ప్రారంభ ఓవర్లలో ధారాళంగా పరుగులిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement