Saturday, June 15, 2024

TS | బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లతకు సెక్యూరిటీ పెంచిన కేంద్రం..

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతకు భద్రత పెంచింది. మాధవీలతకు వై ప్లస్ భద్రత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలు కావడంతో ముప్పు ఉంటుందని ఆమెకు వై ప్లస్ భద్రతను కేంద్రం ఆమోదించింది.

వీఐపీ భద్రతలో భాగంగా ఆమె వెంట 11 మందికి పైగా సీఆర్పీఎఫ్ భద్రతా సిబ్బంది ఉంటారు.ఆరుగురు సీఆర్పీఎఫ్ సెక్యూరిటీ ఆఫీసర్లు మాధవీలత వెంట ఉండి ఆమెకు రక్షణగా ఉంటారు. మరో ఐదుగురు భద్రతా సిబ్బంది బీజేపీ ఎంపీ అభ్యర్థి ఇంటి వద్ద సెక్యూరిటీగా ఉంటారు. కాగా, ఈ ఎన్నిక‌ల్లో హైదరాబాద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీపై మాధవీలత పోటీ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement