Thursday, May 16, 2024

RR vs GT | టాస్ గెలిచిన గుజరాత్…

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్ – గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ జట్టు తొలుత ఫీల్డింగ్ చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. ఇక జైపూర్ సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో వర్షం కురవడంతో టాస్ ఆలస్యం అయ్యింది.. దీంతో మ్యాచ్ 7:40 PM కు ప్రారంభంకానుంది.

జ‌ట్ల వివ‌రాలు

గుజరాత్ టైటాన్స్ : మాథ్యూ వేడ్ (WK), శుభమన్ గిల్ (c), B సాయి సుదర్శన్, విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, ఉమేష్ యాదవ్, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్

రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (c), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్, కుల్దీప్ సేన్

ఈ సీజన్ లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ వరుస విజయాలతో అదరగొడుతోంది. పాయింట్స్ టేబుల్ లో 8 పాయింట్స్ తో రాజస్థాన్ రాయల్స్ టాప్ పొజిషన్లో ఉంది. గుజరాత్ టైటాన్స్ విషయానికి వస్తే, ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడి, రెండు గెలిచి, మూడు ఓడింది. నాలుగు పాయింట్లతో పాయింట్ల టేబుల్ లో ఏడో స్థానంలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement