Thursday, May 16, 2024

రోల్స్‌ రాయిస్‌ స్పెక్టర్‌.. ఈవీ మార్కెట్లోకి బ్రిటిష్‌సంస్థ

బ్రిటిష్‌ లగ్జరీ కార్ల దిగ్గజం రోల్స్‌ రాయిస్‌ కూడా ఎలక్ట్రిక్‌ వాహన (ఈవీ) విభాగంలోకి ప్రవేశించింది. ఆల్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ ‘స్పెక్టర్‌’ పేరుతో రూపొందించిన తొలి ఎలక్ట్రిక్‌ కారును ఆవిష్కరించింది. వచ్చే ఏడాది చివరి త్రైమాసికంలో (అక్టోబరుడ్ఖిసెంబరు) కస్టమర్లకు ఈ కార్లను అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్లో దీని ప్రారంభ ధరను 4.13 లక్షల డాలర్లుగా నిర్ణయించిన కంపెనీ.. భారత మార్కెట్‌ రేటును మాత్రం ప్రకటించలేదు. అయితే, ఈ కాస్ట్‌లీ, లగ్జరీ ఎలక్ట్రిక్‌ కారుకు కలినన్‌, ఫాంటమ్‌ మోడళ్ల మధ్యలో స్థానం కల్పించనున్నట్లు రోల్స్‌ రాయిస్‌ తెలిపింది. సూపర్‌ లగ్జరీ ఎలక్ట్రిక్‌ కారైన స్పెక్టర్‌.. సింగిల్‌ చార్జింగ్‌తో 515 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని, సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4.5 సెకన్లలో అందుకోగలదని కంపెనీ వెల్లడించింది. 900ఎన్‌ఎం సామర్థ్యంగల బ్యాటరీ, 577బీహెచ్పీ విద్యు త్‌ను వెలువరిస్తుంది. 23 అంగుళాల వీల్స్‌తో డిజైన్‌ చేశారు.

- Advertisement -

తుదిదశ టెస్టింగ్‌ కసరత్తు జరుగుతున్నది. స్ల్పిట్‌ హెడ్‌లైట్‌, 22 ఎల్‌ఈడీ రేర్‌ లైటింగ్‌తో వస్తోంది రోల్స్‌ రాయిస్‌ స్పెక్ట్రే ఈవీ. దీని మాదిరిగా ఏ కారుకూ లార్జ్‌ గ్రిల్లేలు ఉండవు. తలుపులు చాలా పొడవుగా డిజైన్‌ చేశారు. ఇంటిరియర్‌ లగ్జరీ లుక్‌తో వస్తుంది. ఈ కారు ధర రోల్స్‌ రాయిస్‌ కుల్లినన్‌ ఎస్‌యూవీ, రోల్స్‌ రాయిస్‌ ఫాంటోమ్‌ వీఐఐఐ సెడాన్‌ మోడ ల్‌ కార్ల ధరల మధ్య ఉంటుందని సంస్థ యాజ మాన్యం పేర్కొంది.కుల్లినన్‌ ఎస్‌యూవీ కారు ధర రూ. 6.95 కోట్లతొ పాటు గంటకు 6.6 కి.మీ. స్పీడ్‌ వెళుతుంది. ఫాంథోమ్‌ వీఐఐఐ సెడాన్‌ కారు రూ. 9.50 కోట్లు పలుకడంతోపాటు గంటకు 7.1 కిలోమీటర్ల మైలేజీ ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement