Sunday, April 28, 2024

భారీ నష్టాల నుంచి ఊరట.. కొనుగోళ్ల మ‌ద్ద‌తుతో పుంజుకున్న సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం నష్టాల్లోనే ముగిశాయి. ప్రారంభంలో ప్రతికూలంగా ట్రేడింగ్‌ మొదలై మధ్యాహ్నానికి కనిష్టాలకు చేరుకున్నాయి. అయితే, దిగువ స్థాయిల్లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు పుంజుకున్నాయి. అయినప్పటికీ లాభాల్లోకి రాలేదు. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల సంకేతాలు మార్కెట్లో ప్రతికూలతలు నింపాయి. మరోవైపు రూపాయి బలహీనత, చైనాలో కోవిడ్‌ కేసుల విజృంభణ మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ ఊహించని రీతిలో దీర్ఘకాలిక దిగుబడుల కోసం అనుమతించ దగిన బ్యాండ్‌ను 25 బీపీఎస్‌ నుంచి 50 బీపీఎస్‌ పాయింట్లకు పెంచింది. ఇది దీర్ఘకాలిక వడ్డీరేట్లు పెరగడానికి వీలు కల్పిస్తుంది.

61806 వద్ద నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌, ఒక దశలో 61,102 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. అక్కడి నుంచి దాదాపు 600 పాయింట్లు పుంజుకుంది. చివరకు 103 పాయింట్ల నష్టంతో ముగిసింది. నిఫ్టీ కూడా 18,340 వద్ద మొదలై 18,202 పాయింట్ల కనిష్టాన్ని తాకిన తర్వాత 35 పాయింట్ల నష్టంతో 18,385వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో రూపాయి మారకం విలువ 82.77 వద్ద ట్రేడయింది.

సెన్సెక్స్‌-30 సూచీలో 9 షేర్లు లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, టీసీఎస్‌, రిలయన్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, సన్‌ఫార్మా, నెస్లే ఇండియా, ఏషియన్‌ పెయింట్స్‌ లాభాల్లో ముగియగా, టాటా మోటార్స్‌, హెచ్‌యుఎల్‌, ఎంఅండ్‌ఎం, భారతీయ ఎయిర్‌టెల్‌, మారుతీ, ఎల్‌అండ్‌టి, ఎన్‌టిపిసి, టాటాస్టీల్‌ షేర్లు నష్టపోయాయి. ఎల్‌ఐసీ షేరు మూడు శాతానికిపైగా పెరిగి రూ.754 వద్ద ఆరు నెలల గరిష్టాన్ని తాకింది. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.27శాతం దిగువన ముగియగా, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.02శాతం పడిపోయింది. ఆటో, మీడియా, రియాల్టిd సూచీలు 0.7శాతం నుంచి 1 శాతం మేర క్షీణించగా, ఐటీ, మెటల్‌ సూచీలు 0.2శాతం మేర లాభపడ్డాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement