Monday, May 6, 2024

Delhi | యూనివర్సిటీ ప్రొఫెసర్లకు సుప్రీంలో ఊరట.. విచారణ వాయిదా

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో 2019కు ముందు జరిగిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు చెల్లవంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో ప్రొఫెసర్లకు ఊరట లభించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల అంశంపై విచారణ వాయిదా పడింది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు తొలుత హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునివ్వడంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ గవార్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోంది.

రిజర్వేషన్లు పాటిస్తూనే తమ నియామకం జరిగిందని ప్రొఫెసర్ల తరఫున సీనియర్ న్యాయవాది రాజగోపాల్ వాదనలు వినిపించారు. రిజర్వేషన్లను అమలు చేసిన తర్వాత ప్రొఫెసర్లను ఎలా తొలగిస్తారంటూ ధర్మాసనం ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీంతో ప్రొఫెసర్లను కొనసాగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు తెలియజేశారు. ప్రభుత్వం ఇచ్చిన వివరణను రికార్డు చేసుకున్న ధర్మాసనం ప్రొఫెసర్లను వెంటనే నియమించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు సంబంధించి విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement