Sunday, May 19, 2024

Railways | రైల్వేలో రికార్డు స్థాయిలో నియామకాలు..

అమరావతి, ఆంధ్రప్రభ: ఉద్యోగ కల్పనలో భారతీయ రైల్వేలు ప్రపంచంలోకెల్లా ఒకటైన అతిపెద్ద సంస్థ. కేంద్ర ప్రభుత్వానికి చెందిన రైల్వే ఉద్యోగాల కోసం అర్హత సాధించడానికి పరీక్షలకు పోటీ తీవ్రంగా ఉంటుంది. ఇటీవలి కాలంలో రైల్వే అధికారులు నూతన నియామకాల కోసం అనేక చర్యలను చేపట్టారు. భారతీయ రైల్వేలు గడచిన 9 సంవత్సరాలలో అనగా 2014 నుండి ఇప్పటి వరకు రైల్వేలోని వివిధ విభాగాలలో దాదాపు 4,99,000 మంది అభ్యర్థుల నియామకం ద్వారా వార్షిక సగటు 50,000 కంటే అదనపు సంఖ్యలొఉద్యోగాలను కల్పించారు.

వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇది చాలా ముఖ్యమైన ప్రక్రియ. దాదాపు రెండున్నర సంవత్సరాలు భారతదేశం అంతటా కోవిడ్‌-19 మహమ్మారికి కుదేలయ్యారు. ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమై అనేక మంది ఉద్యోగం, ఉపాధి అవకాశాలను కోల్పోయారు. ఆ సమయంలో రైల్వే నియమాకాలను సజావుగా చేపట్టి అనేక మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించి ఆదుకుంది.

- Advertisement -

వాస్తవానికి భారతీయ రైల్వేలు డిసెంబర్‌ 2020 నుండి జూలై 2021 మధ్య కొత్త అభ్యర్థులను ఎంపిక చేయడానికి ప్రపంచంలోనే అతిపెద్ద కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (ఆన్‌లైన్‌) నిర్వహించింది. దీని ద్వారా ఈ ఎంపిక ప్రక్రియలో సంపూర్ణ పారదర్శకతను సాధించింది. ఈ ఎంపికలో భారతదేశంలోని 402 నగరాల్లోని 1,277 కేంద్రాల్లో దాదాపు 2.3 కోట్ల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. అభ్యర్థులందరికీ సముచిత అవకాశం కల్పించేందుకు 15 భాషల్లో పరీక్షలు నిర్వహించారు.

మెకానికల్‌, ఎలక్ట్రిక్రల్‌, సివిల్‌, సిగ్నల్స్‌ టెలికమ్యూనికేషన్స్‌ మొదలైన వివిధ విభాగాల్లో అసిస్టెంట్‌ లోకో పైలట్లు, స్టేషన్‌ మాస్టర్లు, ట్రైన్‌ మేనేజర్లు, జూనియర్‌ ఇంజనీర్లు, టెక్నీషియన్లు, కమర్షియల్‌ క్లర్కులు, ట్రాక్‌ మెయింటైనర్‌, పాయింట్స్‌మన్‌, అసిస్టెంట్‌ వంటి వివిధ కేటగిరీల ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించారు. గత సంవత్సరంలోనే భారతీయ రైల్వే దాదాపు 1.5 లక్షల మంది అభ్యర్థులను నియమించారు.

పరోక్షంగా ఉపాధి కల్పన…

ఈ నియామకాలు రైల్వేలు అందించే ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు అయితే, భారతీయ రైల్వేలు తద్వారా అనేక పరోక్ష ఉద్యోగాలను కూడా సృష్టించాయి. ఉదాహరణకు, సగటున, 1 కి.మీ ట్రాక్‌ను నిర్మించడం వల్ల సంవత్సరానికి దాదాపు 33,000 పనిదినాలు లభిస్తాయి. అంటే రోజుకు దాదాపు 90 రోజుల ఉపాధి కలుగుతుంది. గడచిన సంవత్సరంలో, భారతీయ రైల్వే తన పరిధిలో సుమారు 5,600 కి.మీల ట్రాక్‌ను నిర్మించడం ద్వారా రోజుకు దాదాపు 5,06,301 పనిదినాలను కల్పించింది.

దీంతో పాటు ఓవర్‌ హెడ్‌ ఎక్విప్‌మెంట్‌ (ఓ.ఎచ్‌.ఈ), సిగ్నలింగ్‌, ఉత్పత్తి యూనిట్లు (పి.యూ.స్‌) మరియు పి.ఎస్‌.యూలు, స్టేషన్‌ పునరాభివృద్ధి పనులు వంటి భారీ స్థాయిలో ఇతర మౌలిక సదుపాయాల పనులపై భారతీయ రైల్వే నిరంతరం కృషిచేస్తోంది. దీని ద్వారా, ఒక సంవత్సరంలో దాదాపు 10 లక్షల పరోక్ష ఉద్యోగాలకు అవకాశాలు ఏర్పడతాయి. భారతీయ రైల్వేలు అందించే ఈ ప్రధాన పరోక్ష ఉపాధి కల్పన ద్వారా ఆర్థిక వ్యవస్థపై గుణాత్మక అభివృద్ధి దోహదపడుతుంది.

భారతీయ ఆర్థిక వ్యవస్థలో ఉపాధి కల్పనపై రైల్వే మౌళిక సదుపాయాల కల్పన పనుల ప్రభావం దాదాపు 3.5 రెట్లు ఎక్కువగా ఉందని అంచనా. ఇది వివిధ రంగాలలో దాదాపు 35 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించడాన్ని సూచిస్తుంది. వాస్తవానికి, ఈ ఏడాది భారతీయ రైల్వేలకు రికార్డు స్థాయిలో మూలధన వ్యయం పద్దు కింద రూ. 2,50,000 కోట్లు కేటాయించారు. గత ఆర్ధిక సంవత్సరాలతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం కేటాయింపు అత్యధికంగా ఉంది. తద్వారా ఆర్థిక వ్యవస్థలో అదనపు ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు దోహదపడుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement