Saturday, April 27, 2024

RCB vs PBKS | బెంగళూరు బోణీ.. పంజాబ్ పై ఆర్సీబీ విజయం

ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్‌పై 4 వికెట్ల తేడాతో గెలిచి టోర్నీలో తొలి విజయం సాధించింది. కాగా, 177 పరుగుల ఛేదనలో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (77) బౌండరీలతో రెచ్చిపోయాడు. 49 బంతుల్లో 11 ఫోర్లు, రెండు సిక్సర్లతో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయితే, మిగిలిన టాపార్డర్ బ్యాటర్లు పూర్తిగా విఫలమైయ్యారు.

చివర్లో దినేష్ కార్తీక్ 28 (నాటౌట్), మహిపాల్ లోమ్రోర్ 17 (నాటౌట్) పరుగులతో అదరగొట్టారు. దీంతో పంజాబ్‌పై ఆర్సీబీ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక పంజాబ్ బౌలర్లలో కగిసో రబడ, హర్‌ప్రీత్ బ్రార్ చెరో రెండు వికెట్లు తీయగా.. శామ్ కుర్రాన్, హర్షల్ పటేల్‌లకు చెరో వికెట్ దక్కింది.

మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. పంజాబ్ కెప్టెన్ శికర్ ధవన్ (45) పరుగులతో ఆటక్టుకోగా.. ప్రభసిమ్రాన్ సింగ్ (25), సామ్ కర్రాన్ (23), జితేష్ శర్మ (27) ప‌రుగులు చేసి వెనుదిర‌గా.. ఆక‌ర్లో శశాంక్ సింగ్ 8 బంతుల్లో 21 ప‌రుగులు చేయడంతో ఆర్సీబీ ముందు పోరాడే ల‌క్ష్యాన్ని నిర్దేశించగలిగారు. బెంగళూరు బౌలర్లలో మహ్మద్ సిరాజ్, గ్లెన్ మాక్స్ వెల్ రెండేసి వికెట్లు తీయగా… యశ్ దయాల్, అల్జారీ జోసెఫ్ ఒక్కో వికెట్ తీశారు. కాగా, 177 ప‌రుగుల టార్గెట్ తో ఆర్సీబీ బ‌రిలోకి దిగ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement