Sunday, May 19, 2024

అమ్మానాన్న ప్రోత్సాహంతోనే ర్యాంక్‌: శ్రుతి

న్యూఢిల్లి: తన తల్లిదండ్రులు, మిత్రుల సహకారంతోనే సివిల్‌ సర్వీసెస్‌లో ట్యాప్‌ ర్యాంక్‌ సాధించినట్లు శ్రుతి శర్మ తెలియజేశారు. యూపీఎస్‌సీ నిర్వహించిన 2021 సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో మొదటి మూడు ర్యాంకులను మహిళలే సాధించారు. ఈ పరీక్షలో విజయం సాధించాలంటే ఎంతో సహనం ఉండాలనీ, చాలా కష్టపడాల్సి ఉంటుందని శ్రుతి అన్నారు. ఢిల్లి కి చెందిన శ్రుతి శర్మ ఢిల్లి యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కాలేజీలో చదువుకున్నారు.

తనకు మొదటి ర్యాంక్‌ వస్తుందని ఊహించలేదనీ, ఈ ఫలితం తనను ఎంతో సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిందని ఆమె తెలియజేశారు. జెఎన్‌యూలో పీజీ చేసిన శ్రుతి జామియా మిలియా ఇస్లామియా రెసిడెన్షియల్‌ కోచింగ్‌ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. కాగా రెండవ ర్యాంక్‌ వచ్చిన అంకితా అగర్వాల్‌ మాట్లాడుతూ… ఐఏఎస్‌లో చేరిన తరువాత మహిళ సాధికారత, ప్రాథమిక ఆరోగ్య రంగాలలో కృషి చేస్తానని తెలియజేశారు. ఇండియన్‌ రెవెన్యూ సర్వీసెస్‌ 2020 బ్యాచ్‌కు చెందిన ఆమె ప్రస్తుతం ఎన్‌ఏసీఐఎన్‌లో ప్రొబెషన్‌లో ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement