Sunday, May 5, 2024

ఢిల్లి మంత్రిని అరెస్టు చేసిన ఈడీ..

న్యూఢిల్లి: ఢిల్లి లోని ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్న సత్యేంద్ర జైన్‌ను ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ సోమవారం నాడు అరెస్టు చేసింది. మనీలాండరింగ్‌ కేసులో ఆయనను అరెస్టు చేసినట్లు ఈడీ తెలియజేసింది. అరవింద్‌ కేజ్రీవాల్‌ కేబినెట్‌లో మంత్రిగా పనిచేస్తున్న సత్యేంద్ర జైన్‌ 2015-16లో కోల్‌కతాలోని సంస్థతో హవాలా వ్యవహారాలు నడిపినట్లు ఈడీ ఆరోపించింది. రెండు నెలల క్రితమే సత్యేంద్ర జైన్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ. 4.81 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది.

‘పంజాబ్‌ ఎన్నికలకు ముందే… సత్యేంద్ర జైన్‌ను ఈడీ అరెస్టు చేస్తుందని మాకు సమాచారం అందింది. గతంలో కూడా కేంద్రం సత్యేంద్ర జైన్‌ ఇల్లు, కార్యాలయాలపై దాడులు చేయించింది. అయితే, ఆ దాడులలో వారికి ఏమీ దొరకలేదు’ అని పంజాబ్‌ ఎన్నికలకు ముందే ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ ప్రకటించారు.ఇప్పుడు ఆయన ప్రకటన నిజమైంది. పంజాబ్‌ ఎన్నికలలో ఆప్‌ ఘనవిజయం సాధించి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement